Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకం చైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు

చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకం  చైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు

ముఖ్యమైన పాయింట్స్:

  • చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకం
  • చైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4:

మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, చొరవతో నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)కు తెలంగాణ ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. 13 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ జీవో ఆర్టీ నంబర్ 777ను నవంబర్ 4న జారీ చేసింది.నూతన కమిటీ చైర్‌పర్సన్‌గా కట్టా రామారావును నియమించారు. సభ్యులుగా కేశిరెడ్డి నర్సిరెడ్డి, వనం రామకోటయ్య, అనంతు రేణుక, గజగంటి ప్రవీణ్, కారింగుల సుజాత, దోరేపల్లి లింగమ్మ, గంటా రాఘవరెడ్డి, దిండిగాల కిరణ్, మాలోతు సైదా, నన్నెపంగు ఏడుకొండలు, బండ్ల నాగేశ్వరరావు, పల్లె లింగయ్య నియమితులయ్యారు.గత పాలకవర్గం పనితీరుపై సహకార శాఖ అధికారులు నిర్వహించిన విచారణలో పలు లోపాలు గుర్తించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంఘానికి రావాల్సిన రూ.1.77 కోట్ల బకాయిల వసూలుకు తగిన చర్యలు తీసుకోకపోవడం, ఆడిట్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో సంఘం కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ కమిటీ ఆరు నెలలపాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స