🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 7:09 am Posted by : DAINAMIC NEWS

చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకం చైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు

News Image
ముఖ్యమైన పాయింట్స్:చిల్లేపల్లి పీఏసీఎస్‌కు నూతన పాలకవర్గం నియామకంచైర్‌పర్సన్‌గా కట్టా రామారావు.. 13 మందితో కమిటీ ఏర్పాటు


శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4:

మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం, చొరవతో నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)కు తెలంగాణ ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. 13 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ జీవో ఆర్టీ నంబర్ 777ను నవంబర్ 4న జారీ చేసింది.నూతన కమిటీ చైర్‌పర్సన్‌గా కట్టా రామారావును నియమించారు. సభ్యులుగా కేశిరెడ్డి నర్సిరెడ్డి, వనం రామకోటయ్య, అనంతు రేణుక, గజగంటి ప్రవీణ్, కారింగుల సుజాత, దోరేపల్లి లింగమ్మ, గంటా రాఘవరెడ్డి, దిండిగాల కిరణ్, మాలోతు సైదా, నన్నెపంగు ఏడుకొండలు, బండ్ల నాగేశ్వరరావు, పల్లె లింగయ్య నియమితులయ్యారు.గత పాలకవర్గం పనితీరుపై సహకార శాఖ అధికారులు నిర్వహించిన విచారణలో పలు లోపాలు గుర్తించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంఘానికి రావాల్సిన రూ.1.77 కోట్ల బకాయిల వసూలుకు తగిన చర్యలు తీసుకోకపోవడం, ఆడిట్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో సంఘం కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ కమిటీ ఆరు నెలలపాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగనుంది.
🏠 Home