Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ముఖ్యమైన పాయింట్స్:

  • నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం
  • చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి
  • 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం
  • జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ


నేరేడుచర్ల, అక్టోబర్ 8 ,శుభోదయ డైనమిక్ వార్త

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ - Additional Image

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 687 ప్రకారం రంగినేని స్పందనను చైర్‌పర్సన్‌గా, మునగాల భాస్కర్‌రెడ్డిని వైస్ చైర్మన్‌గా నియమించారు.

17 మందితో నూతన కమిటీ

నూతన పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యులు, ముగ్గురు అధికారిక సభ్యులకు అవకాశం కల్పించారు. అధికారిక సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ అధికారి (సూర్యాపేట), సహాయ వ్యవసాయ సంచాలకులు (హుజూర్‌నగర్), నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ వ్యవహరించనున్నారు.

ఇవి కూడా చదవండి

రెండేళ్ల పాటు పదవీకాలం

తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెట్ల చట్టం–1966లోని నిబంధనల ప్రకారం కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నూతన పాలకవర్గం కొనసాగనుంది.

నూతన పాలకవర్గ సభ్యులు

రంగినేని స్పందన – చైర్‌పర్సన్, మునగాల భాస్కర్‌రెడ్డి – వైస్ చైర్మన్, సూరోజు రవీంద్రచారి, పొతురాజు జ్యోతి, బుర్రి వెంకటయ్య, రామావత్ వస్యా, ధనావత్ సైదులు, ఉట్కూరి సైదులు, కర్నం రామ నర్సయ్య, పల్లె కాశయ్య, గడ్డం ప్రియాంక, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, పోల విశ్వనాథం, రెబ్బె రమేష్ సభ్యులుగా నియమితులయ్యారు.

రైతుల ప్రయోజనాలే లక్ష్యం

నూతన పాలకవర్గం రైతుల ప్రయోజనాల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాల కల్పన, మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నూతన పాలకవర్గం నియామకానికి సహకరించిన మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.