Tuesday, July 28, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేట జిల్లా పోలీస్ వారాంతపు పరేడ్ ఘనంగా నిర్వహణ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ...

సూర్యాపేట జిల్లా పోలీస్ వారాంతపు పరేడ్ ఘనంగా నిర్వహణ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బంది సమస్యలపై పోలీస్ దర్బార్ – త్వరిత పరిష్కారానికి హామీ ప్రజలకు భరోసా కల్పించేలా సేవలు అందించాలని ఎస్పీ సూచన

సూర్యాపేట బ్యూరో , జూలై 4,శుభోదయ డైనమిక్ వార్త

సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ ఐపీఎస్ హాజరై పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం (సలామీ) స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు.

పోలీస్ దర్బార్ నిర్వహణ

పరేడ్ అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పోలీస్ దర్బార్’లో పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

క్రమశిక్షణ, ప్రజాసేవకు ప్రాధాన్యం

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్  ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచే పోలీసులను అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.పోలీసులు వివాదాలకు దూరంగా ఉంటూ బాధితులు, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. నేరాలకు పాల్పడే వారిపట్ల, చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన క్రమశిక్షణ ప్రతి పోలీసు సిబ్బందికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.

యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టాలి

పోలీస్ యూనిఫాం ప్రజల్లో ధైర్యం, భరోసాను కలిగించే ప్రతీక అని ఎస్పీ అన్నారు. ప్రజలు పోలీసు యూనిఫాంను గౌరవిస్తారని, అందువల్ల ప్రతి సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా యూనిఫాం ధరించి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని సూచించారు.

పరేడ్‌తో సమన్వయం, శారీరక దృఢత్వం

వారాంతపు పరేడ్ ద్వారా పోలీసు సిబ్బందిలో పరస్పర సమన్వయం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందుతాయని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ సమాజంలో శాంతిభద్రతలకు ప్రతీక మాత్రమే కాకుండా ప్రజలకు ధైర్యం, భరోసా కల్పించే వ్యవస్థగా నిలవాలని అన్నారు.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్మ్‌డ్ రిజర్వ్ అడ్మిన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, ఏఆర్ అధికారులు, సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్, ఆత్మకూరు, పెనపహాడ్, చివ్వేంల పోలీస్ స్టేషన్ల సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments