కోదాడ, జూలై 4, శుభోదయ డైనమిక్ వార్త
కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
బూరుగడ్డలో హనుమాన్ స్వామి పూజలు
ఉదయం 11:30 గంటలకు హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నిర్వహించే దివ్య సుందర కార్యసిద్ధి హనుమాన్ స్వామి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొంటారు.
నారాయణపురంలో పల్లె దవాఖాన ప్రారంభం
మధ్యాహ్నం 12:00 గంటలకు చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో టీజీఎంఎస్‌ఐడీసీ (TGMSIDC) నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.
వివాహ వేడుకకు హాజరు
మధ్యాహ్నం 12:30 గంటలకు కోదాడలోని పురమ రంగారావు ఫంక్షన్ హాల్‌లో బొప్పిడి సువార్త వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మధ్యాహ్నం 3:00 గంటలకు కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు
