Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ?

ముఖ్యమైన పాయింట్స్:

  • నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు!
  • కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే!
  • కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ?

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల,నవంబర్ 7

నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు!  కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే!  కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ? - Additional Image

నేరేడుచర్లలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పట్టణంలో బియ్యం విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రకాన్ని బట్టి కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరువు పరిస్థితులతో ఉపాధి కరువై అల్లాడుతున్న ప్రజలకు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి.

కరువు ఒకవైపు.. ధరల మోత మరోవైపు!

సరైన వర్షాలు లేకపోవడం, నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో కుడికాలువకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. ఫలితంగా ఆయకట్టు రైతులు సాగు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బోర్లలోనూ నీరు తగ్గడంతో వ్యవసాయ పనులు మందగించాయి. కూలీలకు పనులు దొరకని పరిస్థితుల్లో నిత్యావసర ధరలు పెరగడం పేద కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది.

ఇవి కూడా చదవండి

వ్యాపారులదే ధరల రాజ్యమా?

నేరేడుచర్లలో బియ్యం దుకాణాల్లో విక్రయ ధరలపై నియంత్రణ కొరవడిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. క్వింటా బియ్యం రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతుండగా, కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. దుకాణాల వారీగా ధరల్లో తేడాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల చర్యలేవీ?

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా, నేరేడుచర్లలో పరిస్థితి మాత్రం మారడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? వ్యాపారుల విక్రయ ధరలను పర్యవేక్షించే బాధ్యత అధికారులకు లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా?

పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి బియ్యం దుకాణాలు, రైస్ మిల్లులు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిల్వలు, బిల్లులు, విక్రయ ధరలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ ధరకు బియ్యం అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమైతే సామాన్యుడి కంచంలో అన్నం కూడా భారంగా మారే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో స్పందిస్తారా? లేక బియ్యం ధరల భారాన్ని ప్రజలే భరించాలా?

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు  చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు  నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు  గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం