Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అల్మాస్‌గూడలో క్రైస్తవ యువతులపై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి మహిళలపై దాడి అమానుషం, సమాజానికి సిగ్గుచేటు - బిషప్ దుర్గం ప్రభాకర్

అల్మాస్‌గూడలో క్రైస్తవ యువతులపై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి  మహిళలపై దాడి అమానుషం, సమాజానికి సిగ్గుచేటు - బిషప్ దుర్గం ప్రభాకర్

ముఖ్యమైన పాయింట్స్:

  • అల్మాస్‌గూడలో క్రైస్తవ యువతులపై దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి
  • మహిళలపై దాడి అమానుషం, సమాజానికి సిగ్గుచేటు - బిషప్ దుర్గం ప్రభాకర్

డైనమిక్ న్యూస్, నవంబర్ 04, సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ నందు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అల్మాస్‌గూడ, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల క్రైస్తవ యువతులపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ అల్మాస్‌గూడలో క్రైస్తవ యువతులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీలను కోరారు.ఈ ఘటనపై తక్షణమే కేసు నమోదు చేయాలని, ఆడపిల్లలను కొట్టి, బూతులు తిట్టి మహిళల పట్ల అమానుషంగా, దురుసుగా, క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట నియోజకవర్గ క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మత స్వేచ్ఛను కాపాడతానని ఎల్.బి. స్టేడియం సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నామని, మానవ హక్కులు పరిరక్షించబడాలని, ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, మానవ హక్కుల కమిషన్ ను కూడా కలుస్తామని హెచ్చరించారు.
దోషులను శిక్షించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలోసూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ధరావత్ లాకు నాయక్, సీనియర్ పాస్టర్ జాటోత్ డేవిడ్ నాయక్, రెవ. పంది మార్క్, పాస్టర్ వి. ఫిలిప్, రెవ. టి. కిరణ్ బాబు, పాస్టర్ పెరుమాళ్ల ప్రసన్న కుమార్, పాస్టర్ ధరావత్ శాంసన్ నాయక్, పాస్టర్ తీగల డేవిడ్, అబ్రహాము తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స