Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్ధరాత్రి వరకు బెల్ట్‌ షాపుల జోరు.. అబ్కారీ శాఖ నిఘా ఏదీ? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు బెల్ట్‌ షాపులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

అర్ధరాత్రి వరకు బెల్ట్‌ షాపుల జోరు.. అబ్కారీ శాఖ నిఘా ఏదీ?  నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు  బెల్ట్‌ షాపులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

ముఖ్యమైన పాయింట్స్:

  • అర్ధరాత్రి వరకు బెల్ట్‌ షాపుల జోరు.. అబ్కారీ శాఖ నిఘా ఏదీ?
  • నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు
  • బెల్ట్‌ షాపులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

శుభోదయ డైనమిక్ న్యూస్‌ – హుజూర్‌నగర్:

హుజూర్‌నగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు మద్యం విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న బార్లను తలపిస్తున్న బెల్ట్‌ షాపులు!

ఇవి కూడా చదవండి

కొన్ని ప్రాంతాల్లో మద్యం కొనుగోలుతో పాటు అక్కడే కూర్చొని సేవించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనావాసాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి విక్రయాలు కొనసాగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన

హుజూర్‌నగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న మహిళ హత్య, వేపల సింగారంలో హత్యాయత్నం, మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో భార్యపై భర్త దాడి ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలకు మద్యం మత్తు కారణమా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, మద్యం దుర్వినియోగం వల్ల కుటుంబాలు, సమాజంపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తం కావాలని స్థానికులు కోరుతున్నారు.

అబ్కారీ శాఖ స్పందించాలి

బెల్ట్‌ షాపుల నిర్వహణ, మద్యం విక్రయాల సమయాలు, అనుమతుల పరిస్థితిపై అబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అర్ధరాత్రి వరకు అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అత్యధికంగా చదివినవి
కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?  తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు  ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు?  ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు? తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌.. వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు  పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్స