అర్ధరాత్రి వరకు బెల్ట్‌ షాపుల జోరు.. అబ్కారీ శాఖ నిఘా ఏదీ? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు బెల్ట్‌ షాపులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

ముఖ్యమైన పాయింట్స్:అర్ధరాత్రి వరకు బెల్ట్‌ షాపుల జోరు.. అబ్కారీ శాఖ నిఘా ఏదీ?నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలుబెల్ట్‌ షాపులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్ శుభోదయ డైనమిక్ న్యూస్‌ – హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు మద్యం విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న బార్లను తలపిస్తున్న బెల్ట్‌ షాపులు! కొన్ని ప్రాంతాల్లో మద్యం కొనుగోలుతో పాటు అక్కడే కూర్చొని సేవించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని...