Tuesday, April 21, 2026
Homeతాజా సమాచారంవందేమాతరం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గీతాలాపన

వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గీతాలాపన

మెదక్ జిల్లా స్టాఫర్, నవంబర్ 7, డైనమిక్

స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన జాతీయ గేయం “వందేమాతరం” 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఘనంగా సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడింది.

దేశభక్తి స్ఫూర్తితో గీతాలాపన

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ టౌన్, రూరల్, హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది “వందేమాతరం” గీతాన్ని సమూహంగా ఆలపించి దేశభక్తి సందేశాన్ని వ్యాప్తి చేశారు.

‘వందేమాతరం’లో ఐక్యత, త్యాగ స్ఫూర్తి ఉంది — ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ —“భారత స్వాతంత్ర్య సమరంలో ‘వందేమాతరం’ గేయం అనేకమందిలో పోరాట స్ఫూర్తిని రగిలించింది. ఈ గేయం దేశభక్తి, ఐక్యత, త్యాగం వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రతి పోలీస్ సిబ్బంది ఈ విలువలను మనసులో దిద్దుకొని ప్రజల సేవలో నిబద్ధతతో పని చేయాలి” అని పిలుపునిచ్చారు.

ప్రముఖ అధికారులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, సుభాష్ చంద్ర బోస్, రంగా నాయక్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జ్, శైలేందర్, రామకృష్ణతో పాటు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments