Thursday, April 23, 2026
Homeతాజా సమాచారంవందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తినల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశభక్తి గేయాలాపన

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తినల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశభక్తి గేయాలాపన

డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 7

1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి నేడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశభక్తి ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఎస్పీ ఆధ్వర్యంలో గేయాలాపన


జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ — “దేశభక్తిని, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం ప్రతి భారతీయుడిలో ఆత్మగౌరవాన్ని నింపుతుంది. మనమంతా దేశ సేవలో భాగమవ్వాలన్న స్పూర్తి ఇందులో ఉంది” అని పేర్కొన్నారు.

దేశభక్తి జ్యోతి నిలుపుదాం:ఎస్పీ శరత్ చంద్ర పవార్


పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల రక్షణతో పాటు దేశ గౌరవాన్ని కాపాడే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

దేశభక్తి గీతంతో గర్జించిన పోలీస్ కార్యాలయం

పోలీస్ సిబ్బంది సమిష్టిగా వందేమాతరం గేయాన్ని ఆలపించడంతో కార్యాలయం దేశభక్తి ఉత్సాహంతో మారుమోగింది. కార్యక్రమం చివరగా జాతీయ జెండాకు వందనాలు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments