నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్, మే 17
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం 7వ వార్డులో ప్రజల సౌకర్యార్థం సిమెంటు బల్లాలను ఏర్పాటు చేశారు. ప్రధాని కూడలి, రామాలయం సమీపం, బస్తీ దవాఖాన ప్రాంతాల్లో మొత్తం 18 సిమెంటు బల్లాలను రూ.51 వేల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది.
కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమం
మలిగిరెడ్డి సైదిరెడ్డి – ఝాన్సీ దంపతులు, జంగిలి ఝాన్సీ – వీరయ్య కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రధాన కూడళ్లలో బల్లాలను ఏర్పాటు చేయడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
కౌన్సిలర్ సహకారం అభినందనీయం
ఈ కార్యక్రమం 7వ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ సహకారంతో నిర్వహించబడింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

