శుభోదయ డైనమిక్ న్యూస్ | మోతే | ఆగస్టు 20
మండల యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
మోతే మండలంలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న లస్కర్లు మండల యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా చుండిరి లక్ష్మీనరసింహ, ఉపాధ్యక్షుడిగా ఉప్పునూతల నరేష్, ప్రధాన కార్యదర్శిగా కోల ఉపేందర్, కోశాధికారిగా శివ ఎన్నికయ్యారు.
వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ
సూర్యాపేట లస్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో లస్కర్లు, యూనియన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
