Friday, September 11, 2026
Homeతాజా సమాచారంవిద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ రెండు జతల యూనిఫామ్ అందజేత.. సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ రెండు జతల యూనిఫామ్ అందజేత.. సద్వినియోగం చేసుకోవాలి

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 11

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్లలో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన స్కూల్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకటరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు.

చదువుల్లో రాణించాలి

ఈ సందర్భంగా చైర్మన్ కొనతం వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సౌకర్యాల్లో భాగంగా రెండు జతల స్కూల్ యూనిఫామ్‌లను అందించడం ఆనందకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని కోరారు.

పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్. నాగరాజు, కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, టీఎంసీ-మెప్మా శ్వేత బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments