Friday, September 11, 2026
Homeతాజా సమాచారంగణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: ఎస్పీ కె. నరసింహ

గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: ఎస్పీ కె. నరసింహ

అనుమతి తీసుకుంటే భద్రత, పెట్రోలింగ్, నిమజ్జన మార్గాలపై సూచనలు

సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 11, శుభోదయ డైనమిక్ వార్త

గణేష్ మండపాల ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపన, నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.గణేష్ మండపాల నిర్వాహకులుhttps://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాలని ఎస్పీ సూచించారు.

మండపాల వద్ద పోలీసుల భద్రత

ఆన్‌లైన్‌లో మండపాల వివరాలను నమోదు చేయడం ద్వారా ఆయా మండపాలకు పోలీసులు భద్రత కల్పించడంతో పాటు పెట్రోలింగ్, గస్తీ నిర్వహించేందుకు వీలు కలుగుతుందని ఎస్పీ తెలిపారు. గణేష్ విగ్రహానికి ప్రత్యేక నంబర్ కేటాయించి పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు.

నిమజ్జనానికి మార్గదర్శకాలు

విగ్రహ నిమజ్జనం రోజున ఏ మార్గంలో ఊరేగింపు నిర్వహించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై పోలీసు శాఖ నుంచి అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు కూడా ఈ నమోదు ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు.గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించి, పోలీసు శాఖ అందించే రక్షణ, భద్రతా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కె. నరసింహ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments