మోతే, ఆగస్టు 18,శుభోదయ డైనమిక్ వార్త
మోతే మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో అమృత వాటర్ బాటిల్స్ కంపెనీని మంగళవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు. అనంతరం కంపెనీలోని యంత్రాలను పరిశీలించి, వాటర్ బాటిల్స్ తయారీకి పాటిస్తున్న నిబంధనలు, విధానాలపై యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
మండల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యం
మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛమైన నీటితో మినరల్ వాటర్ బాటిల్స్ పరిశ్రమను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. కంపెనీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు, బాధ్యతాయుత విధానాలను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల శేషిరెడ్డి, కంపెనీ యజమాని మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
