నేరేడుచర్ల, జూలై 23,శుభోదయ డైనమిక్ వార్త
సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల మండల మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నందిపాటి గురవయ్య, ప్రధాన కార్యదర్శిగా పుల్లెముల వీరస్వామి, కోశాధికారిగా లకుమల్ల నాగరాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ సీనియర్ కబడ్డీ క్రీడాకారుల సమక్షంలో జరిగింది.
గ్రామీణ స్థాయిలో మోడ్రన్ కబడ్డీ విస్తరణకు కృషి చేస్తా: గురవయ్య
నూతన అధ్యక్షుడు నందిపాటి గురవయ్య మాట్లాడుతూ, మోడ్రన్ కబడ్డీ సంప్రదాయ కబడ్డీతో పోలిస్తే ఆధునిక నిబంధనలతో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో యువత ఈ క్రీడపై మరింత ఆసక్తి చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి మోడ్రన్ కబడ్డీని విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి, సీనియర్ పీడీ నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి, సీనియర్ పీడీలు నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బత్తిని హుస్సేన్, రేటోజు శ్రీకాంత్, సీనియర్ పీఈటీ బుడిగ హరికృష్ణ, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఉపెల్లి బాబు, వసుకుల సుదర్శన్, బుడిగ సతీష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
