Monday, July 27, 2026
Homeతాజా సమాచారంనేరేడుచర్లలో ప్రజల సౌకర్యార్థం 10 సిమెంట్ బల్లాల ఏర్పాటు రూ.28 వేల వ్యయంతో మూడో విడతలో...

నేరేడుచర్లలో ప్రజల సౌకర్యార్థం 10 సిమెంట్ బల్లాల ఏర్పాటు రూ.28 వేల వ్యయంతో మూడో విడతలో బల్లాల ఏర్పాటు

నేరేడుచర్ల, జూలై 23,శుభోదయ డైనమిక్ వార్త

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ, 8వ వార్డుల్లో ప్రజలకు ప్రధాన కూడళ్ల వద్ద సౌకర్యంగా కూర్చునేందుకు రూ.28 వేల విలువైన 10 సిమెంట్ బల్లాలను మూడో విడతలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 7వ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ సహకారంతో నిర్వహించబడింది.

దాతల జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమం

మాజీ సర్పంచ్ కొప్పుల సర్వయ్య జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు, ముడుసు సతీష్ (ప్రిన్స్) ఫోటోగ్రాఫర్, పొగబత్తిని శేఖర్ వారి తండ్రి పొగబత్తిని లక్ష్మయ్య జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం అందించారు. వారి సహకారంతో 7వ, 8వ వార్డులలో 10 సిమెంట్ బల్లాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరింత కొనసాగాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments