Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉరిగా చిత్రీకరించి.. హత్య

ఉరిగా చిత్రీకరించి.. హత్య

ముఖ్యమైన పాయింట్స్:

  • ఉరిగా చిత్రీకరించి.. హత్య
  • కారంపూడి మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్టు....... సీఐ భాస్కర్, ఎస్ ఐ వాసు


కారంపూడి, అక్టోబరు 5: శుభోదయ డైనమిక్ వార్త


కారంపూడిలో ఈ నెల 1న జరిగిన రమావత్‌ శ్రీలక్ష్మీబాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో రమావత్‌ బాబా నాయక్‌ (31), మల్లికాబాయి @ గుంజ మల్లికా (39), సీతాబాయి (46)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. బంగారు ఆభరణాలు, ఆస్తి విషయంలో శ్రీలక్ష్మీబాయితో నిందితులకు వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెపై ముగ్గురూ దాడి చేయగా మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో వేలాడదీసినట్లు పేర్కొన్నారు.సంఘటనా స్థల పరిశీలన, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల ప్రమేయాన్ని గుర్తించి అక్టోబరు 5న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కర్ర, రక్తపు మరకలు తుడిచేందుకు ఉపయోగించిన గుడ్డను స్వాధీనం చేసుకున్నారు.కారంపూడి సీఐ ఆవుల భాస్కర్, ఎస్‌ఐ వాసు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది.

ఇవి కూడా చదవండి