Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఫతేపురంలో ఘనంగా మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం లొ పాల్గొన్న జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 03 Oct 2026, 04:19 AM | తాజా సమాచారం
ఫతేపురంలో ఘనంగా మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం లొ పాల్గొన్న జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి


శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 3



నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామంలో రైతు తాటికొండ నారాయణమ్మ వ్యవసాయ క్షేత్రంలో శనివారం మెగా ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని 10 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు.



ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం



ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలను వివరించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి


నాలుగేళ్లకు ఎకరాకు రూ.16,800 ఆర్థిక సహాయం



జాతీయ వంటనూనెలు–ఆయిల్‌పామ్ పథకం కింద మొదటి నాలుగు సంవత్సరాల్లో తోట నిర్వహణ, అంతర పంటల సాగుకు హెక్టారుకు రూ.42,000, అంటే ఎకరాకు రూ.16,800 వరకు ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిందు సేద్య పరికరాల ఏర్పాటుకు కూడా ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.



రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం



ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయంతో పాటు అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నేరేడుచర్ల మండలంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో తాళ్ల సురేష్‌రెడ్డి, సర్పంచ్, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సహాయ వ్యవసాయ సంచాలకులు అలీమ్, తహసీల్దార్ సైదులు, మండల వ్యవసాయ అధికారి షేక్ జావేద్, ఉద్యానవన అధికారి ప్రదీప్తి, ఉద్యానవన విస్తరణ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్మల, హిమబిందు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ క్షేత్ర సహాయకులు, క్షేత్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు.