ఫతేపురంలో ఘనంగా మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం లొ పాల్గొన్న జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 3 నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామంలో రైతు తాటికొండ నారాయణమ్మ వ్యవసాయ క్షేత్రంలో శనివారం మెగా ఆయిల్‌పామ్ మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని 10 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలను వివరించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లకు ఎకరాకు...