Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎనిమిది నెలలుగా పగిలిన డ్రైనేజీ గునా.. అధికారుల నిర్లక్ష్యం!,లింగగిరి మెయిన్ బజార్‌లో ప్రమాదకర పరిస్థితులు

Author
Posted By DAINAMIC NEWS
| 28 Sep 2026, 03:44 AM | తాజా సమాచారం
ఎనిమిది నెలలుగా పగిలిన డ్రైనేజీ గునా.. అధికారుల నిర్లక్ష్యం!,లింగగిరి మెయిన్ బజార్‌లో ప్రమాదకర పరిస్థితులు


వాహనదారులు, రైతులకు తప్పని ఇబ్బందులు



ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు.. ప్రజల్లో ఆగ్రహం



శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 28



సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామంలోని 4వ, 5వ వార్డుల మెయిన్ బజార్‌లో డ్రైనేజీపై ఉన్న గునా గత ఎనిమిది నెలలుగా పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పగిలిన గునా కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంత సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం:


ఇవి కూడా చదవండి


డ్రైనేజీ గునా దెబ్బతిన్న విషయాన్ని గ్రామ కార్యదర్శి, గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?



ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అంటూ స్థానికులు నిలదీస్తున్నారు.



వెంటనే మరమ్మతులు చేపట్టాలి



ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పగిలిన డ్రైనేజీ గునాకు తక్షణమే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని లింగగిరి గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.