ఎనిమిది నెలలుగా పగిలిన డ్రైనేజీ గునా.. అధికారుల నిర్లక్ష్యం!,లింగగిరి మెయిన్ బజార్‌లో ప్రమాదకర పరిస్థితులు

వాహనదారులు, రైతులకు తప్పని ఇబ్బందులు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు.. ప్రజల్లో ఆగ్రహం శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 28 సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామంలోని 4వ, 5వ వార్డుల మెయిన్ బజార్‌లో డ్రైనేజీపై ఉన్న గునా గత ఎనిమిది నెలలుగా పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పగిలిన గునా కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంత సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు...