Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దేవాదాయ భూములపై భూబకాసురుల కన్ను!దేవుడి మాన్యం భూములకు రక్షణ ఏది?బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్

Author
Posted By DAINAMIC NEWS
| 23 Sep 2026, 06:56 AM | తాజా సమాచారం
దేవాదాయ భూములపై భూబకాసురుల కన్ను!దేవుడి మాన్యం భూములకు రక్షణ ఏది?బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్


శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 23



దేవాదాయ భూములపై బీజేపీ నాయకుల పరిశీలన



హుజూర్‌నగర్ పట్టణ పరిధిలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన దేవాదాయ భూముల వ్యవహారంపై బీజేపీ నాయకులు పరిశీలన చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాధిత రైతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.



నాలుగు తరాలుగా సాగు చేస్తున్నాం



బాధిత కుటుంబాలు మాట్లాడుతూ.. సుమారు నాలుగు తరాలుగా దేవాదాయ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమకు అన్యాయం జరిగేలా ఇతరులకు హక్కులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూముల పూర్వ చరిత్ర, రికార్డులు, సాగు వివరాలు, శిస్తు చెల్లింపులను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరారు.

ఇవి కూడా చదవండి



రికార్డులు పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి



బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. దేవుడి మాన్యం భూములను పరిరక్షించడం దేవాదాయ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అన్నారు. పాత రికార్డులు, సాగు హక్కులు, శిస్తు వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం



అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం జరుగుతోందని బాధితులు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని హరీష్ గౌడ్ కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ చేపట్టాలని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బెల్లంకొండ నరేష్, సోమగాని ప్రదీప్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కంటు నాగరాజు, దళిత మోర్చా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కొప్పెర సాయిరాం, పంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.