దేవాదాయ భూములపై భూబకాసురుల కన్ను!దేవుడి మాన్యం భూములకు రక్షణ ఏది?బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్

శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 23 దేవాదాయ భూములపై బీజేపీ నాయకుల పరిశీలన హుజూర్‌నగర్ పట్టణ పరిధిలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన దేవాదాయ భూముల వ్యవహారంపై బీజేపీ నాయకులు పరిశీలన చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాధిత రైతులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నాలుగు తరాలుగా సాగు చేస్తున్నాం బాధిత కుటుంబాలు మాట్లాడుతూ.. సుమారు నాలుగు తరాలుగా దేవాదాయ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న తమకు అన్యాయం జరిగేలా ఇతరులకు హక్కులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూముల పూర్వ చరిత్ర, రికార్డులు, సాగు వివరాలు, శిస్తు...