Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పంటలను కాపాడుతాం.. వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వినియోగించాలి

Author
Posted By DAINAMIC NEWS
| 23 Sep 2026, 06:43 AM | తాజా సమాచారం
పంటలను కాపాడుతాం.. వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వినియోగించాలి


శుభోదయ డైనమిక్ వార్త – సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 23



కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు.. సానుకూల స్పందన



రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి



ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.



రూ.26.93 కోట్ల పనులు ప్రారంభం



బుధవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్లతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. జానల్‌దిన్నె గ్రామపంచాయతీ భవనం రూ.20 లక్షలు, నేరేడుచర్ల గ్రంథాలయ భవనం రూ.33 లక్షలతో నిర్మించిన పనులను కూడా ప్రారంభించారు. మొత్తం రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు.



కర్ణాటక నుంచి నీటి విడుదలకు ప్రయత్నాలు



రైతుల పంటలను కాపాడేందుకు రాష్ట్రాల సహకారం కోరుతున్నామని మంత్రి తెలిపారు. జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను రక్షించేందుకు కర్ణాటక నుంచి నీటి విడుదల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తెలంగాణ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని, నీటి లభ్యతను పరిశీలించి సహకరించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు.ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


ఇవి కూడా చదవండి


వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు



జలాశయాల్లోని నీటిని సమర్థంగా వినియోగించి పంటలను కాపాడేందుకు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగు చేసిన పంటలను అనాథలుగా వదిలిపెట్టబోమని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.



రహదారి నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగు



నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డు నిర్మాణంతో పత్తేపురం, వైకుంఠపురం, లాల్ లక్ష్మీపురం, మేడారం, బక్కయ్యగూడెం, దూపాడు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని మంత్రి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.



కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతం కావడం



యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రైతుల రక్షణ, యువతకు ఉపాధి, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు,మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొణతం వెంకటరెడ్డి,పాలకీడు మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి,మేడారం సర్పంచ్ సత్యనారాయణ,యామిని వీరయ్య,ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు