పంటలను కాపాడుతాం.. వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వినియోగించాలి
శుభోదయ డైనమిక్ వార్త – సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 23 కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు.. సానుకూల స్పందన రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రూ.26.93 కోట్ల పనులు ప్రారంభం బుధవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్లతో...