Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా తిరంగా ర్యాలీ

Author
Posted By DAINAMIC NEWS
| 14 Aug 2026, 05:21 AM | తాజా సమాచారం
ఘనంగా తిరంగా ర్యాలీ


నేరేడుచర్ల, ఆగస్టు 14,శుభోదయ డైనమిక్ వార్త



భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు నేరేడుచర్ల పట్టణంలో శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి సమక్షంలో, హుజూర్‌నగర్ నియోజకవర్గ తిరంగా యాత్ర కో-ఇన్‌చార్జి నందిపాటి హిందూజ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం జరిగింది.



భారీగా పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు



నేరేడుచర్ల పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి, చింతకుంట్ల రాజేష్‌రెడ్డి, పాలకవీడు మండల బీజేపీ అధ్యక్షుడు రమావత్ నరినాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పలు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి


త్రివర్ణ పతాకాలతో దేశభక్తి నినాదాలు



జాతీయ జెండాలను చేతబూనిన పాల్గొనేవారు దేశభక్తి నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు. త్రివర్ణ పతాకాలతో నేరేడుచర్ల పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.



త్యాగాలను స్మరించుకోవాలి: చల్ల శ్రీలతారెడ్డి



ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరం స్మరించుకోవాలని అన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.