ఘనంగా తిరంగా ర్యాలీ

నేరేడుచర్ల, ఆగస్టు 14,శుభోదయ డైనమిక్ వార్త భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు నేరేడుచర్ల పట్టణంలో శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి సమక్షంలో, హుజూర్‌నగర్ నియోజకవర్గ తిరంగా యాత్ర కో-ఇన్‌చార్జి నందిపాటి హిందూజ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం జరిగింది. భారీగా పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు నేరేడుచర్ల పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి, చింతకుంట్ల రాజేష్‌రెడ్డి, పాలకవీడు మండల బీజేపీ అధ్యక్షుడు రమావత్ నరినాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పలు పాఠశాలల...