Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వానాకాలం-2026: సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం రైతు వేదికల్లో నాణ్యమైన సన్న వరి విత్తనాలు అందుబాటులో

Author
Posted By DAINAMIC NEWS
| 24 Jun 2026, 11:35 PM | తాజా సమాచారం
వానాకాలం-2026: సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం రైతు వేదికల్లో నాణ్యమైన సన్న వరి విత్తనాలు అందుబాటులో


హైదరాబాద్, శుభోదయ డైనమిక్ డెస్క్, జూన్ 25



తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వానాకాలం-2026 సీజన్‌లో సన్న వరి సాగును ప్రోత్సహిస్తోంది. అధిక మార్కెట్ డిమాండ్, మంచి ధరలు, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా రైతు వేదికలలో విత్తన మేళాల ద్వారా నాణ్యమైన సన్న వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది.



తెలంగాణ సోనా రైతుల తొలి ఎంపిక



RNR-15048 (తెలంగాణ సోనా) రకం వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు అనుకూలంగా ఉండి, అతి సన్న గింజలు, మంచి అన్నం నాణ్యత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (51)తో ప్రత్యేక గుర్తింపు పొందింది. మార్కెట్లో ఈ రకానికి అధిక డిమాండ్ ఉంది.



కూనారం వరి-2కు పురుగు నిరోధకత



KNM-1638 (కూనారం వరి-2) రకం ఉల్లికోడు బయోటైప్-3ను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మంచి దిగుబడి, రుచికరమైన అన్నం, నాణ్యమైన బియ్యం ఈ రకం ప్రత్యేకతలు.



సాంబ మసూరికి దేశవ్యాప్త ఆదరణ



BPT-5204 (సాంబ మసూరి) దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సన్న వరి రకం. ఉత్తమ అన్నం నాణ్యత, ఎగుమతులకు అనుకూలత, వినియోగదారుల ఆదరణ ఈ రకాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.


ఇవి కూడా చదవండి


HMT సోనా – అధిక మార్కెట్ ధర



HMT సోనా రకం అతి సన్న గింజలు, అత్యుత్తమ రుచి, మంచి అన్నం నాణ్యతతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. మార్కెట్లో అధిక ధర లభించే రకాలలో ఇది ఒకటి.



జై శ్రీరామ్, KNM-7715కు మంచి డిమాండ్



జై శ్రీరామ్, KNM-7715 రకాలు మధ్యకాలిక పంటలుగా మంచి దిగుబడి, నాణ్యమైన బియ్యం, మార్కెట్ డిమాండ్‌తో రైతులకు లాభదాయకంగా ఉంటాయని వ్యవసాయ శాఖ తెలిపింది.



సిద్ధి రకం సాంబ మసూరికి ప్రత్యామ్నాయం



WGL-44 (సిద్ధి) రకం సాంబ మసూరి తరహా గింజ, అన్నం నాణ్యతను కలిగి ఉండటంతో పాటు కొన్ని పురుగులు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. తెలంగాణలో విస్తృత సాగుకు అనుకూలమైన లాభదాయకమైన సన్న వరి రకంగా గుర్తింపు పొందింది.



సన్న వరి సాగుతో అధిక ఆదాయం



సన్న వరి రకాల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని వ్యవసాయ శాఖ సూచించింది. రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా తగిన రకాలను ఎంపిక చేసుకొని రైతు వేదికలలో అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ తెలిపారు.