వానాకాలం-2026: సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం రైతు వేదికల్లో నాణ్యమైన సన్న వరి విత్తనాలు అందుబాటులో

హైదరాబాద్, శుభోదయ డైనమిక్ డెస్క్, జూన్ 25 తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వానాకాలం-2026 సీజన్‌లో సన్న వరి సాగును ప్రోత్సహిస్తోంది. అధిక మార్కెట్ డిమాండ్, మంచి ధరలు, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా రైతు వేదికలలో విత్తన మేళాల ద్వారా నాణ్యమైన సన్న వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. తెలంగాణ సోనా రైతుల తొలి ఎంపిక RNR-15048 (తెలంగాణ సోనా) రకం వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు అనుకూలంగా ఉండి, అతి సన్న గింజలు, మంచి అన్నం నాణ్యత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (51)తో ప్రత్యేక గుర్తింపు పొందింది. మార్కెట్లో ఈ రకానికి అధిక డిమాండ్ ఉంది. కూనారం వరి-2కు పురుగు నిరోధకత...