Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేపు ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్

Author
Posted By DAINAMIC NEWS
| 03 Feb 2026, 09:43 AM | తాజా సమాచారం
రేపు ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్


నల్గొండ బ్యూరో, ఫిబ్రవరి 3, డైనమిక్ న్యూస్



రేపు ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు మంగళవారం పరిశీలించారు.



హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు తనిఖీ



హెలిప్యాడ్, ప్రధాన వేదిక, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల స్థలాలు, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు.



అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేయాలి – కలెక్టర్



ఎర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, బ్యారికేడింగ్, పార్కింగ్, రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి



ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత



ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరు వద్ద భారీ బహిరంగ సభతో పాటు ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.



అధికారులు పాల్గొన్నారు



ఈ పరిశీలనలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.