రేపు ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ బ్యూరో, ఫిబ్రవరి 3, డైనమిక్ న్యూస్ రేపు ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు మంగళవారం పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు తనిఖీ హెలిప్యాడ్, ప్రధాన వేదిక, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల స్థలాలు, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేయాలి – కలెక్టర్ ఎర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో...