Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోటార్ సైకిల్ దొంగతనాల ముఠా అరెస్ట్ రూ.7 లక్షల విలువైన 8 బైక్‌లు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం

Author
Posted By DAINAMIC NEWS
| 03 Feb 2026, 04:55 AM | తాజా సమాచారం
మోటార్ సైకిల్ దొంగతనాల ముఠా అరెస్ట్ రూ.7 లక్షల విలువైన 8 బైక్‌లు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం


నల్లగొండ బ్యూరో, ఫిబ్రవరి 3 డైనమిక్ న్యూస్



నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతేపల్లి పోలీసులు విజయవంతంగా అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు.



అరెస్టైన నిందితులు



పగిళ్ల శివ కుమార్ (19)
తండ్రి: శ్రీను,వృత్తి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (CGA), కె.పి.ఎం కాలేజ్, నల్లగొండ
ప్రస్తుత నివాసం: రామగిరి, నల్లగొండ
శాశ్వత నివాసం: హనుమాన్ నగర్, చండూరు



అలుగలు వంశీ కృష్ణ (23)
తండ్రి: వెంకటేష్ వృత్తి: కెమెరామెన్ నివాసం: భవానీ కాలనీ, రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా అదేవిధంగా ఇద్దరు బాల నేరస్తులు కూడా కేసులో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



కేసు నమోదు వివరాలు



క్రైమ్ నెం: 16/2026
సెక్షన్: 303 (2) BNS
పోలీస్ స్టేషన్: కేతేపల్లి



ఫిర్యాదు నేపథ్యం



తేది 30-12-2025 రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కడప జిల్లా వాసి పల్లెం నరసయ్య, కేతేపల్లి గ్రామంలోని సాయి కృష్ణ హోటల్ వద్ద తన Yamaha R15 మోటార్ సైకిల్ (AP-40-BB-0177) పార్క్ చేసి నిద్రించగా, 31-12-2025 తెల్లవారుజామున బైక్ కనిపించకుండా పోయింది. దీంతో కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.

ఇవి కూడా చదవండి



వాహన తనిఖీల్లో పట్టుబడిన ముఠా



తేది 03-02-2026 తెల్లవారుజామున కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు బైక్‌లపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.



జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు



విచారణలో, నిందితులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు.A-1 శివ కుమార్ గతంలో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో చర్లపల్లి జైలుకు వెళ్లగా, అక్కడ పరిచయమైన A-2 వంశీ కృష్ణతో కలిసి కేతేపల్లి, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ మరియు హైదరాబాద్ పెట్‌బషీర్‌బాగ్ పరిధిలో మొత్తం 8 దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది.



రిమాండ్‌కు తరలింపు



నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.



సిబ్బందికి అభినందనలు



ఈ కేసును డీఎస్పీ నల్లగొండ పర్యవేక్షణలో ఛేదించిన సీఐ శాలిగౌరారం కొండల్ రెడ్డి, CCS సీఐ జితేందర్ రెడ్డి, ఎస్‌ఐ విజయ్ కుమార్, కేతేపల్లి ఎస్‌ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, వాహీద్, పుష్పగిరి తదితర సిబ్బందిని అదనపు ఎస్పీ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.