మోటార్ సైకిల్ దొంగతనాల ముఠా అరెస్ట్ రూ.7 లక్షల విలువైన 8 బైక్‌లు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం
నల్లగొండ బ్యూరో, ఫిబ్రవరి 3 డైనమిక్ న్యూస్ నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతేపల్లి పోలీసులు విజయవంతంగా అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. అరెస్టైన నిందితులు పగిళ్ల శివ కుమార్ (19)తండ్రి: శ్రీను,వృత్తి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (CGA), కె.పి.ఎం కాలేజ్, నల్లగొండప్రస్తుత నివాసం: రామగిరి, నల్లగొండశాశ్వత నివాసం: హనుమాన్ నగర్, చండూరు అలుగలు వంశీ కృష్ణ (23)తండ్రి: వెంకటేష్ వృత్తి: కెమెరామెన్ నివాసం: భవానీ కాలనీ, రాజేంద్ర నగర్,...