Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మానవత్వానికి మారు పేరు సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామపాలకుడు

Author
Posted By DAINAMIC NEWS
| 30 Jan 2026, 11:55 PM | తాజా సమాచారం
మానవత్వానికి మారు పేరు సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామపాలకుడు


మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 31



మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామ సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాసీం సాహెబ్ పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించారు.



రూ.10 వేల నగదు సహాయం అందజేత



ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి స్వయంగా రూ.10,000 నగదు ఆర్థిక సహాయం అందించి, వారిని ధైర్యపరిచారు.



ఆరు నెలల పాటు అద్దె భారం తానే భరిస్తానని హామీ


ఇవి కూడా చదవండి


బాధితులు తాత్కాలికంగా ఇతర గృహంలో నివసించేందుకు అవసరమైన అద్దెను ఆరు నెలల పాటు తానే చెల్లిస్తానని సర్పంచ్ హామీ ఇవ్వడం గ్రామస్తుల మనసులను కదిలించింది.



గ్రామస్తుల ప్రశంసలు



సర్పంచ్ చూపిన స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే నాయకత్వానికి ఇది నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.



కార్యక్రమంలో పాల్గొన్నవారు



ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.