మానవత్వానికి మారు పేరు సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామపాలకుడు
మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 31 మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామ సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న షేక్ ఖాసీం సాహెబ్ పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించారు. రూ.10 వేల నగదు సహాయం అందజేత ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి స్వయంగా రూ.10,000 నగదు ఆర్థిక సహాయం అందించి, వారిని ధైర్యపరిచారు. ఆరు నెలల పాటు అద్దె భారం తానే భరిస్తానని...