Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజల పక్షాన నిలిచే పత్రిక డైనమిక్ : ఆర్డీవో శ్రీనివాసులు హుజూర్ నగర్ లో డైనమిక్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

Author
Posted By DAINAMIC NEWS
| 26 Jan 2026, 04:10 AM | తాజా సమాచారం
ప్రజల పక్షాన నిలిచే పత్రిక డైనమిక్ : ఆర్డీవో శ్రీనివాసులు హుజూర్ నగర్ లో డైనమిక్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ


డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, జనవరి 26



ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా డైనమిక్ తెలుగు దినపత్రిక నిరంతరం కృషి చేస్తోందని హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు.సోమవారం హుజూర్ నగర్ లోని ఆర్డీఓ కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన డైనమిక్ క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీతో కూడిన మీడియా రంగంలో డైనమిక్ తమదైన శైలిలో విశ్వసనీయమైన వార్తలను పాఠకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.



ప్రజా సమస్యలే ప్రధాన అజెండా



సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో తీసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపడమే డైనమిక్ దినపత్రిక ముఖ్య లక్ష్యమని ఆర్డీవో తెలిపారు. ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా ప్రజల వరకు చేరవేయడంలో డైనమిక్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి


డైనమిక్ యాజమాన్యానికి అభినందనలు



ప్రజలకు దగ్గరగా ఉంటూ నిజాయితీతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తున్న డైనమిక్ యాజమాన్యానికి ఆర్డీవో శ్రీనివాసులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయిలో పత్రిక ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



కార్యక్రమంలో పాల్గొన్నవారు



ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ బత్తిని వీరప్రసాద్ గౌడ్, ముశిని వెంకటేశ్వర్లు, పండ్ల నాగరాజు, వెంకటేశ్వర్ల గౌడ్, గుండు వీరబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.