ప్రజల పక్షాన నిలిచే పత్రిక డైనమిక్ : ఆర్డీవో శ్రీనివాసులు హుజూర్ నగర్ లో డైనమిక్ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, జనవరి 26 ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా డైనమిక్ తెలుగు దినపత్రిక నిరంతరం కృషి చేస్తోందని హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు.సోమవారం హుజూర్ నగర్ లోని ఆర్డీఓ కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన డైనమిక్ క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీతో కూడిన మీడియా రంగంలో డైనమిక్ తమదైన శైలిలో విశ్వసనీయమైన వార్తలను పాఠకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో తీసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపడమే డైనమిక్ దినపత్రిక ముఖ్య...