Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి — గ్రామ పోలీసుల సేవా తీరును పరిశీలన

Author
Posted By DAINAMIC NEWS
| 07 Nov 2025, 10:11 AM | తాజా సమాచారం
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి — గ్రామ పోలీసుల సేవా తీరును పరిశీలన


నల్లగొండ బ్యూరో ,నవంబర్ 7 ,డైనమిక్



దేవరకొండ సబ్‌డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని సిబ్బంది పని తీరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఫిర్యాదు స్వీకరణ విధానాలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాక్‌అప్, యస్‌హెచ్‌ఓ గది, స్టేషన్ రైటర్‌ రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు.



కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు — ఎస్పీ హెచ్చరిక



ఎస్పీ పవార్ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను సమగ్రంగా విచారించి న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలి అన్నారు.దర్యాప్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని, చట్టపరమైన చర్యల్లో వేగం అవసరమని సూచించారు.



ప్రజలతో మమేకం అవ్వాలి — గ్రామ పోలీసులకు సూచన



గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజు గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలి అన్నారు.ప్రజా ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని, ప్రజల సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవడం పోలీసుల కర్తవ్యమని గుర్తుచేశారు.



నేర నియంత్రణలో సీసీటీవీలకు ప్రాధాన్యం



పవార్ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అన్నారు.అలాగే రౌడీ షీటర్ల కదలికలపై పర్యవేక్షణ, బ్లూ కోల్ట్, పెట్రో కార్ల ద్వారా నిరంతర పహారా కొనసాగించాలని సూచించారు.100 డయల్ కాల్స్‌పై తక్షణ స్పందన చూపి సంఘటనా స్థలాలకు చేరుకోవాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి



అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం



గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పిడియస్ బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి కార్యకలాపాలను సహించబోమని స్పష్టం చేశారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.



రోడ్డు ప్రమాదాల నివారణపై కఠిన చర్యలు



ఎస్పీ పవార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక నిఘా మరియు డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ల వాహన నడపడం వంటి అంశాలపై రోజువారీ తనిఖీలు జరపాలని సూచించారు.



తనిఖీ సమయంలో అధికారులు



ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, సీఐ నవీన్ కుమార్, యస్‌ఐ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.