జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శన రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి — గ్రామ పోలీసుల సేవా తీరును పరిశీలన

నల్లగొండ బ్యూరో ,నవంబర్ 7 ,డైనమిక్ దేవరకొండ సబ్‌డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని సిబ్బంది పని తీరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఫిర్యాదు స్వీకరణ విధానాలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాక్‌అప్, యస్‌హెచ్‌ఓ గది, స్టేషన్ రైటర్‌ రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు — ఎస్పీ హెచ్చరిక ఎస్పీ పవార్ మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను సమగ్రంగా విచారించి న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలి అన్నారు.దర్యాప్తులో ఎటువంటి...