Wednesday, May 13, 2026
Homeతాజా సమాచారంసూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు...

సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం

శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మే 11

సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ సోమవారం నియమితులయ్యారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాయితి ఆశాదీప్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు

గుండు రామాంజి గౌడ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందారు. గరిడేపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడిగా పేరున్న రామాంజి గౌడ్‌కు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్న రామాంజి గౌడ్

తన నియామకంపై స్పందించిన గుండు రామాంజి గౌడ్.. తనపై నమ్మకం ఉంచి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, వేనా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, హుజూర్‌నగర్ నియోజకవర్గం మరియు గరిడేపల్లి మండల నాయకులు, సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు.జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధితో పాటు సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.

పలువురు నాయకుల అభినందనలు

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments