Wednesday, May 13, 2026
Homeతాజా సమాచారంబండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలి నేరేడుచర్లలో బి ఆర్ ఎస్ నేతల డిమాండ్

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలి నేరేడుచర్లలో బి ఆర్ ఎస్ నేతల డిమాండ్

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,మే 11

నేరేడుచర్ల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

48 గంటలు గడిచినా అరెస్ట్ చేయకపోవడం దారుణం

ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ, లైంగిక వేధింపుల కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ 48 గంటలు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం చట్ట విరుద్ధమని విమర్శించారు. చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

బాధితురాలికి రక్షణ కల్పించాలి

బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని కోరారు.

నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

కేసులో సెక్షన్లు మార్చి నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు కూడా బీసీ వర్గానికి చెందినవారేనని గుర్తుచేస్తూ, కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్‌ను కూడా కేసులో నిందితుడిగా చేర్చాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు, వస్కుల సుదర్శన్, పోకబత్తిని శేఖర్, ఇంజమూరి శ్రీను, మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, లంకెపల్లి నాగార్జున, చిట్యాల శ్రీను, పెదపంగు ఉపేందర్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments