డైనమిక్,నేరేడు చర్ల, నవంబర్ 6
లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో గురువారం ఎంపీపీ ప్రాథమిక పాఠశాల, దాసారం లో రూ.26,500 విలువగల స్పోర్ట్స్ యూనిఫార్మ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ షేక్ యూసుఫ్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ బట్టు మధు, లయన్ చల్లా ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి సేవలు అందిస్తోందని, విద్యార్థులు కృషి చేసి ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి లయన్ సరికొప్పుల నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు లయన్ సూర్యనారాయణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పుల్లయ్య, రిటైర్డ్ హెచ్‌ఎమ్ నాయని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
