డైనమిక్, కారంపూడి, అక్టోబర్ 17
భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కారం పూడి మండల కేంద్రంలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి.అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులకు నిరసన పత్రం (మెమోరాండం) సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మరియు ఎంయస్‌పీ అనుబంధ సంఘాల మండల నాయకులు పాల్గొన్నారు.ముఖ్యంగా మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు తాళ్లూరు జీవరత్నం, ఎంయస్‌పీ అధ్యక్షుడు కడియం మరియదాసు, అధికార ప్రతినిధి కోట మరియదాస్, ప్రధాన కార్యదర్శి తాళ్ల పోగు చంటి తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ—
“న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. మాదిగ సమాజం ఎప్పటికప్పుడు సామాజిక న్యాయ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది” అని తెలిపారు.
