జగదేవపూర్, సెప్టెంబర్ 6 శుభోదయ డైనమిక్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన చెక్కల గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను పలుగుగడ్డ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల అంజయ్య ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు నాయకుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో పలుగుగడ్డ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి, బీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు లింగాల కనకయ్య, యూత్ అధ్యక్షులు చెక్కల క్రిష్ణ, మాజీ కోఆప్షన్ సభ్యులు నర్రా కనకయ్య, గువ్వ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆరుముల్ల నర్సింలు, మాజీ యూత్ అధ్యక్షులు లింగాల క్రిష్ణ, లక్ష్మణ్, కనకరాజు, రామచంద్రం, పెద్దులు, సుధాకర్, రాజయ్య, నర్సింలు, పాండు, కమలాకర్, ప్రశాంత్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
