Saturday, September 12, 2026
Homeతాజా సమాచారంఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ వర్షాలు సమృద్ధిగా కురవాలి.. రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలిభక్తిశ్రద్ధలతో...

ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ వర్షాలు సమృద్ధిగా కురవాలి.. రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలిభక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – పాలకవీడు, ఆగస్టు 23

గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లెంగులగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష

ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments