Sunday, September 13, 2026
Homeతాజా సమాచారంనేరేడు చర్ల మున్సిపల్ చైర్మన్‌ కొణతంకు ఘన సన్మానం లాల్ లక్ష్మీపురం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో...

నేరేడు చర్ల మున్సిపల్ చైర్మన్‌ కొణతంకు ఘన సన్మానం లాల్ లక్ష్మీపురం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందనలు

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 27

నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నేరేడు చర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి‌ కి ఘన సన్మానం నిర్వహించారు. చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయనను శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.

ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సహకార సంఘం చైర్మన్ అనంతు శ్రీనివాస్, లాల్ లక్ష్మీపురం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంజాయి సైదులు, పర్వతం రత్నం, పర్వతం పరమేష్, యాడవెల్లి నరేష్, నాలుగో వార్డు సభ్యుడు గంజాయి గామానెలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments