Saturday, September 12, 2026
Homeఆంధ్ర ప్రదేశ్సర్వేయర్ సులేమాన్ ఖాన్‌కు ఘన సన్మానం జిల్లా సర్వేయర్ సంఘం కార్యదర్శిగా ఎన్నిక

సర్వేయర్ సులేమాన్ ఖాన్‌కు ఘన సన్మానం జిల్లా సర్వేయర్ సంఘం కార్యదర్శిగా ఎన్నిక

కారంపూడి, డైనమిక్ న్యూస్, నవంబర్ 29

కారంపూడి మండలంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న సులేమాన్ ఖాన్ జిల్లా సర్వేయర్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

శాలువా కప్పి అభినందన పత్రం ప్రదానం

కమిటీ అధ్యక్షులు షేక్ బడేసా, ఉపాధ్యక్షులు ఫేక్ మోదిన్ సా సులేమాన్ ఖాన్‌కు శాలువా కప్పి అభినందన పత్రం అందజేశారు.

పారదర్శక సేవలు అందిస్తానని హామీ

ఈ సందర్భంగా సులేమాన్ ఖాన్ మాట్లాడుతూ భూసంబంధిత పనులు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

పలువురు పాల్గొన్న కార్యక్రమం

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments