నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23
నేరేడుచర్ల పట్టణ & మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంతం ఉత్సాహపూరితంగా మారింది.ప్రవీణ్ కుమార్ సేవలకు నాయకుల ప్రశంసలు తెలిపారు.ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమాజ సేవ, విద్యా రంగంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ వేడుకల్లో బి ఆర్ ఎస్ నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, డి సి సీ బి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, నేరేడుచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాగండ్ల శ్రీధర్, ఇంజమూరి యశోద రాములు,మండల పార్టీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, బి ఆర్ ఎస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, ఎస్ సీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు నందిపాటి గురవయ్య, టి ఆర్ ఎస్ వి నాయకులు పల్లెపంగు నాగరాజు, మలిదశ ఉద్యమ నాయకులు లకుమల్ల రవీందర్, ఆర్ ఎస్ పి ప్రధాన అనుచరుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
